మీలో ఉన్న అనంతమైన మీ సబ్కాన్సస్ మైండ్ గురించి తెలిస్తే జీవితంలో మీకు తిరిగి ఉండదు!

By StarIndialo
2nd July, 2026

సబ్కాన్సస్ మైండ్ పవర్:

భగవంతుడు సృష్టిలో అన్నిప్రాణుల్ని పుట్టించిన తర్వాత సంతృప్తి చెందక, ప్రాణులన్నింటికంటే ఉన్నతంగా ఉండే ప్రాణిని సృష్టిద్దాం అనే ఆలోచనతో మనిషిని తయారు చేసాడు. అందుకే మనిషికి మనసు అనేదాన్నిచ్చారు. ఆ మనసే మనిషిని మిగతా ప్రాణుల్నుంచి వేరు చేస్తుంది. ఆ మనసే మనిషిని సృష్టినే జయించేంత గొప్ప వాణ్నిగా కూడా చేస్తుంది. అలాంటి మనశ్శక్తిని ఉపయోగించుకునేవాడు మనిషి అవుతాడు. లేదంటే మామూలు మనిషిగానే ఉండిపోయి, జంతువులకంటే ఏమాత్రం భిన్నంగా లేకుండా క్షేవలం బ్రతుకుతూ ఉంటారు.

మనిషికి మననుంది అనే విషయం ఎలా తెలుస్తుంది. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను అంటాడు ఓ గ్రీకు ఫిలాసఫర్, అలాగే 'ఇంద్రియాణాం మనఃబాస్ని' అంటారు కృష్ణుడు భగవద్గీతలో. అంటే మనిషిలోని అన్ని అవయవాలలోకి అత్యంత కీలకమైంది మనసే అని అర్ధం అలాగే మనిషి భవిష్యత్తుని తీర్చిదిద్దేది మనసే అని మన ఉపనిషత్తులు ఇలా చెబుతున్నాయి 'మనః ఏదీ మనుష్యాణాం మూలకారణం బంధ 'మోక్షయో' అంటే మనిషి సుఖంగా ఉండాలన్నా, అష్టకష్టాలు పడాలన్నా మనసే మూలం అని అర్ధం. అందుకే జాన్కీట్స్ కూడా 'ప్రతి మనిషిలోనూ మనసుంటుంది. అది స్వర్గాన్ని నరకంగా చెయ్యగలదు. నరకాన్ని కూడా స్వర్గంగా మార్చగలదు' అని అంటాడు.

ఇన్ని రకాలుగా ఇంతమంది చెబుతున్నది ప్రతి మనిషిలో ఉండే మనసు గురించే. అంత గొప్పదైన మనసు మనకి ఉన్నప్పుడు అది అంత ప్రభావ శాలి అయినపుడు ఎందుకు అందరూ సామాన్యంగానే బ్రతుకుతున్నారు అనే ప్రశ్నవస్తుంది. ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే మనం ఇంకొద్దిగా మనసు లోపలి పొరల్లోకి వెళ్ళాలి.

మనసు-మెదడు:

చాలామంది అనుకునేదేమిటంటే మెదడు-మనసూ ఒకటేనని, మెదడు చేసే పనులు వేరు, మనసు చేసే పనులు వేరు. మెదడు కంప్యూటర్లో హార్డ్వేర్ లాంటిదైతే, మనసు సాఫ్ట్వేర్, ఇంకా చెప్పాలంటే మెదడు ఒక కేసెట్ అయితే మనసు ఆ కేసెట్లో ఉండే టేప్ మీదున్న పాట లాంటిది. అందుకే మెదడు మనకంటికి కనిపిస్తుంది. మనసు కన్పించదు. మనసు స్వరూపం ఏమిటో ఎవరూ చెప్పలేదు. అది ఎలా ఉంటుందనేదీ ఎవరికీ తెలీదు. కేసెట్ని చూడగలం పాటని చూడలేం. కేవలం వినగలం అలాగే మనసు చేసే ఆలోచనల్ని గమనించగలం గాలి వస్తుంటే తెలుసుకోగలం చూడలేం. ఉదాహరణకి గాలిని చూడలేం. గాలి అంతే. అలాగే మనసు కూడా, ఇలాంటి మనసు చాలా విశిష్టమైంది. చాలా శక్తివంతమైనది. దీనిని ఉపయోగించుకున్నవాడు గొప్పవాడు-లేనివాడు సామాన్యుడు.

మనసు-పొరలు:

నేటి ఆధునిక విజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది. ఇది మనసు మీద చేసిన పరిశోధనలలో మనసులో మూడు రకాలుంటాయని తెలుసుకున్నారు. వీటి పనులు కూడా వేరు వేరుగా ఉంటాయని కూడా కనుక్కున్నారు. మనసులో మొదటి పొరని 'కాన్షియస్ మైండ్' అంటాడు.

రెండవ పొరని 'సబ్కాన్ స్ మైండ్' అంటారు. ఆఖరు పొరని 'అన్కాన్షాస్ మైండ్' అనీ అంటారు. కానస్ మైండ్ అంటే మనం రోజువారీ

పనుల్లో 'మనసు' అని ఏదైతే అను కుంటున్నామో ఆ పనులన్నీ చేసే దన్న మాట. ఉదాహరణకి వండర్ వరల్డ్ చదవాలి అనే కోరిక కలిగిందంటే అది కాన్షియస్ మైండ్ యొక్క ఆలోచనన్నమాట. ఇది అందరి లోనూ చాలా విస్తృతంగా ఉంటుంది. కానీ ఈ కాన్షియస్ మైండ్ వచ్చిన ఇబ్బంది ఏమిటంటే ఇది ఎప్పుడూ

ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. కారణాలు వెదుకుతూ ఉంటుంది. వండర్ వరల్డ్ ఎందుకు చదవాలి అని అడుగుతుంది. మీరు దానికి సమాధానం కరెక్టుగా చెబితేనే మీరు వండర్వరల్డ్ చదవగలరు. లేదంటే వండర్వరల్డ్ కంటే టి.వి.లో సీరియల్ చూడొచ్చు కదా అనే రీజన్ని ఇస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు టి.వి. సీరియల్ కంటే వండర్వరల్లో విజ్ఞానం ఎక్కువ అని సమాధానం చెబితే అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ సరే... అని తృప్తి చెందుతుంది. కాబట్టి కాన్షియస్ మైండ్ మైండ్ తో కొన్ని ఇబ్బందులున్నాయి. మీరు అనుకున్నవెంటనే పనులు అవ్వవు. చాలా తర్జన భర్జన జరిగాక మాత్రమే ఫలితం వస్తుంది. ఇక రెండవ పొర 'సబ్కాన్షాస్మైండ్'. ఇది మనసు పొరలన్నిటి కంటే అత్యంత శక్తివంతమైంది. సబ్కాన్షాస్ట్మెండ్ కాన్సస్ మైండ్ ఎప్పుడూ పనిచెయ్యదు. అలా చెప్పడంకంటే సబ్కాన్ప్లస్ మైండ్ని కాన్సస్ మైండ్ పనిచెయ్యకుండా అడ్డుకుంటుంది అనడం సబబు. ఎందుకంటే మీలోపలి నుండి ఏదైనా ఆలోచనవస్తే కాన్షియస్ మైండ్ వెంటనే ఇది ఉందని తెలుసుకున్నాం కదా. కానీ సబ్కానస్మైండ్ అలాకాదు. నమ్మకమైన సేవకుడిలా మీరు ఏది చెబితే దాన్ని నమ్ముతుంది. చిక్కల్లా దీనిని చేరుకోవాలంటే గేట్కేపర్లాంటి కాన్షియస్ మైండ్ దాటి వెళ్ళాల్సిందే. ఒకసారి మీరు సబ్కాన్షాస్ మైండ్ దగ్గరకి వెళ్ళగలిగితే ప్రపంచంలో మీ అంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరు. ఎందుకంటే సబ్క్యాస్ మైండ్ మీరు ఎలా కోరుకుంటే మిమ్మల్ని అలా మారుస్తుంది. నిజం చెప్పాలంటే సబ్కాన్షాస్ మైండ్ 'అల్లాఉద్దీన్ అద్భుత దీపం' లాంటిది అని చెప్పుకుంటే పోలిక సరిగ్గాసరిపోతుంది. ఒక్కోసారి మీరు మీ సబ్కాన్షాస్ మైండ్ని కలుసుకుని మీరు దానితో మాట్లాడగలిగితే... కలిగితే ప్రపంచం అంతా మీదే అవుతుంది. మీరు ఏది కావాలనుకుంటే అది అవుతుంది. ఇది నమ్మడం ఒకపట్టాన కుదరదు. అనుకున్నది అంతా అయిపోతే ప్రపంచం ఇలా ఎందుకు ఉంటుంది అని ప్రశ్నిస్తారు. ఇలా ప్రశ్నించేది కేవలం మీ కాన్స్ట్మెండ్ అని గుర్తుపట్టండి. ఇది కేవలం గేట్ కీపర్. దీని దగ్గర శక్తులేమీ ఉండవు. కేవలం మనకు వచ్చిన ఆలోచనల్ని ఇది రకరకాలుగా విశ్లేషిస్తుందంతే. కాబట్టి కాన్షియస్ మైండ్ ఆలోచనలు ఏమీ తీరవు. ఒక్కసారి మీరు సబ్కానస్ మెండ్ని తడితే... అదొక గొప్ప నిధి.అది మీలోనే ఉంది. మీ కోరికల్ని దీనితో చెప్పుకోండి. ప్రపంచంలో ఎన్నో వేల సంవత్సరాలనుండి గొప్ప గొప్ప వ్యక్తులందరూ వారి సబ్కాన్షాస్ మైండ్ని ఉపయోగించుకుని ప్రముఖలైన వారే.

మీరు మీ సబ్కాన్ స్మైండ్కి ఇచ్చిన సజెషన్ నిజం అవుతుంది. అది మిమ్మల్ని అలా తయారు చేస్తుంది. దీనికి ఓ చిన్న ఉదాహరణ మీరు ఉదయం 5 గంటలకి లేవాలి అని రాత్రి పడుకోబోయే ముందు అనుకుని నిద్రపోండి. మీకు కరెక్టుగా 5 గంటలకి మెలుకువ వస్తుంది. ఇదెలా సాధ్యం అంటే రాత్రి నిద్రపోయే ముందు మీరు చెప్పుకున్న మాటల్ని అది నిజం చేసింది

మీరు ఎక్కువ ధనం సంపాదించాలన్నా, కోరుకున్నవన్నీ మీచెంతకు చేరాలన్నా సబ్కాన్పస్మైండే కారణం, మీరు ఏదైనా జీవితంలో సాధించాలని గోల్సెట్ చేసుకుంటే మీరు మీ సబ్కాన్షాస్ మైండ్తో చెబితే ఆ గోల్ని త్వరగా చేరుతారు. ఎందుకంటే సబ్కాన్పస్ మైండ్ ఓ నమ్మకమైన సేవకునిలా పనిచేస్తుంది.

మీరు షిప్లో కెప్టెన్లా మీ ఆలోచనల్ని సరైన దారిలో, సరైన రీతిలో ఆజ్ఞాపిస్తేనే మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది. అలాగే మీరు మీ ఆలోచనలలో సబ్కాన్షాస్మండ్తో చెప్పుకున్నవన్నీ మీ స్వంతం అవుతాయి.

మీ సబ్కాన్హన్ మైండ్తో ఎప్పుడూ మంచిమాటలే చెప్పుకోవాలి. పొరపాటున కూడా నెగిటివ్ ఆలోచనల్ని దానికి చేరవెయ్యకూడదు. ఉదాహరణకి 'నేను ఆ పనిని చెయ్యలేను' 'నావలన ఆ పనికాదు' 'అమ్మో అది కష్టం' ఇలాంటి నెగిటివ్ ఆలోచనల్ని ఎప్పుడూ సబ్కాన్షాస్మైండ్కి చెప్పకూడదు. దీనికి బదులు ఎప్పుడూ 'నేను ఆ పనిని చెయ్యగలను' 'నేను దానిని సాధించగలను' ఇలాంటి పాజిటివ్ మాటలు చెప్పుకోవాలి. దీనినే మనవాళ్ళు 'తధాస్తు దేవతలు' అనే పదం వాడతారు. పెద్దవాళ్ళు మనం ఏదైనా పొరపాటుగా అంటే అలా అనకూడదు పైన తథాస్తు దేవతలుంటారు. వాళ్ళ తథాస్తు అంటే అదే జరిగిపోతుంది అని. నిజానికి తథాస్తుదేవతలు పైనకాదు. మనలోనే, మన సబ్కాన్స్ మైండ్లోనే ఉంటారు.

జీవితంలో ప్రతి దానికీ ఓ సూత్రం ఉంటుంది. జీవితం ఎలా ఉండాలి. అంటే అది నీ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఆలోచనలు మీ సబ్కాన్స్ మైండ్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా సాధించాలంటే దానికి ఒ రూల్ ఉంది. ఆ రూల్ ఏమిటంటే సాధిద్దాం అనుకున్నదానిని సబ్కాన్షాస్ మైండ్తో చెప్పుకోవటమే.

Tags: , , , , , , , , ,
WhatsApp Google Map

Safety and Abuse Reporting

Thanks for being awesome!

We appreciate you contacting us. Our support will get back in touch with you soon!

Have a great day!

Are you sure you want to report abuse against this website?

Please note that your query will be processed only if we find it relevant. Rest all requests will be ignored. If you need help with the website, please login to your dashboard and connect to support